నామినేషన్‌ పత్రంపై సంతకం చేస్తున్న కృష్ణదాస్‌

నరసన్నపేట నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి

నామినేషన్‌ పత్రంపై సంతకం చేస్తున్న కృష్ణదాస్‌

ప్రజాశక్తి- పోలాకి

నరసన్నపేట నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్‌ ఆదివారం ఆన్‌లైన్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. సాంప్రదాయబద్ధంగా పోలాకి మండలం రాళ్లపాడు అభయాం జనేయ స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు ఆన్‌లైన్‌ నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం ఆన్‌లైన్‌లో నామినేషన్‌ అప్‌లోడ్‌ చేసి ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో తన నామినేషన్‌ను సమర్పించారు. అలాగే ఈ నెల 25న అధికార పూర్వకంగా సెట్‌-2 నామినేషన్‌ వేయనున్నారు. ఈ సందర్భంగా ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నారు.

 

➡️