వేసవి శిక్షణా శిబిరాలు

ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు కంప్యూటర్‌ విజ్ఞానం

లావేరు : కంప్యూటర్‌ కోసం వివరిస్తున్న రిసోర్స్‌పర్సన్‌ వి.జి శ్రీవిద్య

ప్రజాశక్తి- లావేరు

ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు కంప్యూటర్‌ విజ్ఞానం నేర్చువాలని రిసోర్స్‌పర్సన్‌ భోగాపురం వెంకట నాగ శ్రీవిద్య అన్నారు. వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా ఆదివారం కంప్యూటర్‌ కోసం విద్యార్థులకు అవగాహన కల్పించారు. కంప్యూటర్‌ అంటే ఏమిటి, అది చేసే పనులు, ఆపరేటింగ్‌ సిస్టం, ఇమెయిల్‌, ఇంటర్నెట్‌, వివిధ రకాల కంప్యూటర్లు, కీబోర్డ్‌ తదితర అంశాలపై ప్రయోగాత్మకంగా కంప్యూటర్‌పై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. గ్రంథాలయా ధికారి మురపాక శ్రీనివాసరావు, గ్రంథాలయ సహాయకులు టి.వీరభద్రుడు, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.నందిగాం : వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా, సీనియర్స్‌, జూనియర్స్‌ విద్యార్థులకు గ్రంథాలయాధికారి ఎస్‌. ఉదయకిరణ్‌ కబడ్డీ, మ్యూజికల్‌ చైర్‌ పోటీలను నిర్వహించారు. విజేతలకు 7న బహుమతులను అంద జేస్తామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సహాయకులు కె.రాములమ్మ, పాల్గొన్నారు.టెక్కలి : పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు తమ చదువుల్లో భాగంగా ఆంగ్ల భాషపై అవగాహన పెంచుకోవాలని విశ్రాంతి ఆంగ్ల ఉపాధ్యాయులు మోహనరావు కోరారు. గ్రంథాలయాధికారి బి.రూపావతి అధ్యక్షతన గ్రంథాలయ వేసవి విజ్ఞాన శిబిరాల్లో భాగంగా ఆదివారం గ్రంథాాలయంలో విద్యార్థులకు ఆంగ్ల భాషపై అవగాహన కల్పించారు. అనంతరం ఏకాగ్రత, కార్య సాధనకు లభ్యమయ్యే యోగాసనాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి ఆసనాలు వేయించారు.

 

➡️