శిక్షణ ద్వారా డ్రైవింగ్‌లో మెళకువలు

ఆర్‌టిసి హెవీ డ్రైవింగ్‌ స్కూల్‌లో

ధ్రువపత్రాలు అందుకున్న వారితో విజరుకుమార్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఆర్‌టిసి హెవీ డ్రైవింగ్‌ స్కూల్‌లో డ్రైవింగ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 15వ బ్యాచ్‌ డ్రైవర్లకు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.విజరుకుమార్‌ సర్టిఫికెట్లు అందజేశారు. ఆర్‌టిసి కాంప్లెక్సు ఆవరణలో ఉన్న డ్రైవింగ్‌ స్కూల్‌లో వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ తీసుకున్న వారు భవిష్యత్‌లో మంచి డ్రైవర్లుగా గుర్తింపు పొందాలన్నారు. డ్రైవింగ్‌ శిక్షణకు వారంలో 16వ బ్యాచ్‌ మొదలు కానుందని తెలిపారు. లైట్‌ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్‌తో ఒక సంవత్సరం అనుభవం కలిగిన వారు ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 40 రోజుల పాటు శిక్షణతో పాటు మెకానికల్‌ వర్క్‌, యోగా, వ్యక్తిత్వ వికాసం, ట్రాఫిక్‌, రోడ్డు ట్రాఫిక్‌ రూల్స్‌ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

➡️