ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం

జిల్లాలో ప్రశాతం

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

  • జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌, గార

జిల్లాలో ప్రశాతం వాతావరణంలో స్వార్వత్రిక ఎన్నికలు జరిగేందుకు వీలుగా స్వేచ్ఛగా, శాంతి యుతంగా, హింసారహితంగా ఉండే ప్రదేశాల్లోనే పోలింగ్‌ కేంద్రాలు ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని గార మండలంలో శుక్రవారం పర్యటించారు. తహశీల్దార్‌ కార్యాలయాల్లో ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు. ఎఫ్‌ఎస్‌టి బృందాల పనితీరును పరిశీలించారు. అనంతరం ఎన్నికల నిర్వహణలో కీలకంగా ఉన్న మండలస్థాయి అధికారులతో మాట్లాడారు. ప్రచార కార్యకలాపాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం దిశానిర్దేశాల్లో ఎటువంటి తేడా వచ్చినా అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రచార కార్యకలాపాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అన్నారు. అలాగే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు పటిష్టంగా పనిచేసే విధంగా ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఉండాలని సూచించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు, ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటరు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. పర్యటనలో తహశీల్దార్‌ శ్రీనివాసరావు, ఆర్‌ఐ అనిల్‌కుమార్‌, సిఐ ఎల్‌.ఎస్‌.నాయుడు, ఎస్‌ఐ కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️