గత ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం

ఉత్తరాంధ్ర ప్రాంతంలో గడచిన ఐదేళ్లలో లక్షల కోట్ల ప్రజాధనాన్ని

ఎంపిడిఒ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రవికుమార్‌

ప్రజాశక్తి- బూర్జ

ఉత్తరాంధ్ర ప్రాంతంలో గడచిన ఐదేళ్లలో లక్షల కోట్ల ప్రజాధనాన్ని మాజీ సిఎం జగన్మోహన్‌ రెడ్డితో పాటు ఆయన మంత్రులు దుర్వినియోగం చేశారని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ విమర్శించారు ఆదివారం బూర్జ హైస్కూల్‌ ఆవరణలో ఎంపిడిఒ రవీంద్రబాబు పదవి విరమణ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రజల సొమ్ముతో ప్యాలస్‌లు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. గడిచిన ఐదేళ్లు రాష్ట్రంలో అభివృద్ధి శూన్య మన్నారు. రోడ్లు కూడా వేసుకోలేకపోయారన్నారు. నదుల అనుసంధానం, వంశధార, ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టులను పూర్తి చేయలేక పోయారన్నారు. త్వరలో ఆమదాలవలస – శ్రీకాకుళం ప్రధాన రహదారి రోడ్డు వేస్తామన్నారు. నాగావళి, వంశధార కాలువల అనుసంధానం చేస్తామన్నారు. వైసిపి నియంతృత్వపు పోకడలు, అవినీతి, ప్రజల స్వేచ్ఛను హరించడం వలనే ప్రజలు ఆయనకు గుణపాఠం చెప్పారన్నారు. సిఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. అనంతరం పదవి విరమణ చేసిన ఎంపిడిఒ రవీంద్రబాబును ఘనంగా సన్మానించారు. రవీంద్రబాబు మండలంలో మంచి సేవలు అందించారని ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్‌పిటిసి ఆనెపు రామకృష్ణ నాయుడు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

 

➡️