పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

సార్వత్రిక ఎన్నికల

రూట్‌మ్యాప్‌ను పరిశీలిస్తున్న ఎస్‌పి రాధిక

  • ఎస్‌పి జి.ఆర్‌ రాధిక

ప్రజాశక్తి – ఎచ్చెర్ల, నరసన్నపేట

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లోని కుప్పిలి, కొచ్చర్ల, బుడగట్లపాలెంలోని పోలింగ్‌ కేంద్రాలను ఎస్‌పి జి.ఆర్‌ రాధిక బుధవారం పరిశీలించారు. నరసన్నపేట మండలంలోని ఉర్లాం, చెన్నపురంలో పోలింగ్‌ కేంద్రాలను పరిశీఇంచారు. భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు, భౌగోళిక పరిస్థితులను పర్యవేక్షించి రూట్‌ మ్యాప్‌పై ఆరా తీశారు. పోలింగ్‌ రోజు 13న ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్యూలైన్లు, భద్రతాపరమైన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

➡️