బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించిన

చెక్కును అందజేస్తున్న ఎస్‌పి రాధిక

శ్రీకాకుళం:

ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించిన హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ కుటుంబాలకు అండగా ఉంటామని జిల్లా ఎస్‌పి జి.ఆర్‌.రాధిక అన్నారు. అనారోగ్య సమస్యలతో మరణించిన కొత్తూరు పోలీస్‌స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ సవర అనప, గార పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ బూర సురేష్‌ కుటుంబాలకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో శాఖాపరంగా మంజూరు చేసిన రూ.75వేలు చెక్కును అనప సతీమణి లక్ష్మి, సురేష్‌ సతీమణి పద్మావతిలకు ఎస్‌పి చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ సిబ్బంది మరణం చాల బాధాకరమని, జిల్లా పోలీసు శాఖకు తీరని లోటని, ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి ధైర్యంగా తెలియజేయవచ్చని, శాఖా పరంగా మిగిలిన ప్రయోజనాలను త్వరితగతిన అందేలా చూస్తామని ఎస్‌పి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్‌పి డా.జి.ప్రేమ్‌ కాజల్‌, ఎఆర్‌ డిఎస్‌పి ఎల్‌ శేషాద్రినాయుడు, పరిపాలన అధికారి సిహెచ్‌ గోపీనాథ్‌ ఉన్నారు.

 

➡️