పల్లాను కలిసిన ఉక్కు భూసేకరణ అధికారి

Jun 10,2024 23:58 #SDC meet to palla
SDC meet to Palla

ప్రజాశక్తి -గాజువాక : గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును ఉక్కు భూసేకరణ అధికారి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ డిఎస్‌.సునీత తమ సిబ్బందితో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు. ఇటీవలే కాకినాడ ఎస్‌సి కార్పొరేషన్‌ నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చానని తెలిపారు. పల్లాను సత్కరించిన వారిలో డిప్యూటీ తహసీల్దార్‌ ఎ.సంతోష్‌కిరణ్‌, ఆర్‌ఐ చింతల మంగరాజు ఉన్నారు. 

➡️