35వ రోజుకు జిందాల్‌ కార్మికుల నిరసన

Jun 20,2024 20:39

ప్రజాశక్తి-కొత్తవలస :  జిందాల్‌ పరిశ్రమను తెరిపించాలని కోరుతూ కార్మికులు చేపట్టిన నిరసన శిబిరం గురువారం 35వ రోజుకు చేరింది. తక్షణమే కంపెనీ తెరచి కార్మికులందరికీ బేషరతుగా పని కల్పించాలని కార్మికుల డిమాండ్‌ చేస్తున్నారు. కార్యక్రమంలో అప్పన్నపాలెం సర్పంచ్‌ కోన దేవుడు, సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి కె.సురేష్‌, టిఎన్‌టియుసి నాయకులు పిల్లా అప్పలరాజు, సలాది భీమయ్య, వైఎస్‌ఆర్‌టియుసి నాయకులు లగుడు వామాలు, పెదిరెడ్ల ప్రసాద్‌, నమ్మి చినబాబు, బొట్ట రాము, బాలిబోయిన ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️