విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

Dec 28,2023 14:51

ప్రజాశక్తి-రైల్వే కోడూరు(అన్నమయ్య-జిల్లా) : విద్యా రంగంతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎస్ జి ఎఫ్ అండర్ -19 జిల్లా కార్యదర్శి శారద తెలియజేశారు. 27, 28వ తేదీలలో రైల్వేకోడూరు లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అండర్ 14, 17, 19 స్కూల్ గేమ్స్ రాష్ట్రస్థాయి పోటీలలో టంగ్ టా మార్షల్ ఆర్ట్స్ నందు కోచ్ కొన్నిపాటి వెంకటేష్ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శారద తో పాటు పులివెందుల ప్రభుత్వ జూనియర్ కళాశాల పి.డి మరియు క్రీడా పోటీల పరిశీలకులు ప్రసాద్ లు పాల్గొని క్రీడా పోటీలు లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా వారిరువురు మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తాయని అన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులు సుబ్బరాజు గారు,అసోసియేషన్ సభ్యులు రవిశంఖర్ గారు, కొన్నిపాటి వెంకటేష్ మాట్లాడుతూ ఈ పోటీలలో అండర్-14 బాలుర విభాగం నందు కె.హేమంత్ నారాయణ, ఎం.వి గోకుల్ నందన్, డి.నోయల్ స్టర్లిన్ లు ఎంపికయ్యారని, అండర్ -17 బాలుర విభాగం నందు ధ్రువన్ కుమార్, గౌతమ్ కుమార్, సంతోష్ రెడ్డి, చరణ్ జెర్ లోన్, లోకేశ్వర్ రెడ్డి, బాలికల విభాగం నందు ఎం. హర్షిత, అలాగే అండర్ -19 బాలుర విభాగం నందు చరణేశ్వర్ రాజు, ఉపేంద్ర, లోక నితిన్ కుమార్, సాయి యోగేష్, ముని చైతన్య, ముని సాయి శరణ్ లు ఎంపికైనట్లు తెలిపారు. మీరు 2024 జనవరి 10 నుండి 16 వ తేదీ వరకు ఢిల్లీలోని ఛత్రశాల్ స్టేడియం నందు నిర్వహించే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలియజేశారు. జాతీయస్థాయిలో కూడా మెరుగైన ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

➡️