వేసవి శిక్షణ శిబిరం

ప్రజాశక్తి-సంతనూతలపాడు: స్థానిక శాఖా గ్రంథాలయంలో గురువారం నిర్వహించిన వేసవి శిక్షణా శిబిరంలో స్వాతంత్య్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు గురించి అర్చకులు శివరామకృష్ణ పిల్లలకు వివరించారు. శిక్షణా కార్యక్రమమైన 9వ రోజు ప్రారంభంలో పిల్లల చేత కథలు చెప్పించారు. కథలు చదివించారు. తరువాత చదరంగం, స్కిప్పింగ్‌, క్యారమ్‌, ల్యూడో స్నేక్‌ ఆటలను ఆడించారు. అనంతరం పుస్తక సమీక్షల గురించి రెగ్యులర్‌ టీచర్‌ సూర్య వివరించారు. ఈ శిబిరంలో 16 మంది పిల్లలు పాల్గొన్నారు. అనంతరం పిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకుడు కే సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️