ఫిజియోథెరపీని సద్వినియోగం చేసుకోండి

Mar 12,2024 14:44 #Free medical camp, #Kakinada

ప్రజాశక్తి-పెద్దాపురం(కాకినాడ) : మహాత్మా గాంధీ పాఠశాల ఆవరణలో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భవిత కేంద్రంలో మంగళవారం వికలాంగ బాలలకు ఫిజియోథెరపీ నిర్వహించారు. ఈ ఫిజియోథెరపీ క్యాంపును మండల విద్యాశాఖాధికారి కె.ఆర్‌.కె చౌదరి సందర్శించి ఫిజియోథెరపీ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెద్దాపురం మండల పరిధిలో ఉన్న శారీరక వైకల్యం, మెదడు పక్షవాతం గల బాలల తల్లిదండ్రులు భవిత కేంద్రంలో నిర్వహించే ఈ ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఆయన బాలల తల్లిదండ్రులతో మాట్లాడుతూ.. పిల్లల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్టు బి.అపర్ణ, మహాత్మా గాంధీ మున్సిపల్‌ స్కూల్‌ ప్రధానోపాధ్యాయిని ఎంఎల్‌ శివ జ్యోతి, సహిత ఉపాధ్యాయులు బి.దుర్గాప్రసాద్‌ రెడ్డి, బి.ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

➡️