గ్రామాల్లో టిడిపి ప్రచారం

May 9,2024 21:30

ప్రజాశక్తి- గంట్యాడ : మండలంలోని చిన్నవసంత, పొల్లంకి గ్రామాలలో టిడిపి కూటమి ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్‌ గురువారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి విజయం సాధించాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యేగా, ఎమ్‌పిగా కలిశెట్టి అప్పలనాయుడును సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు కొండపల్లి భాస్కర్‌ నాయుడు, అల్లు విజరు, ఎయిమ్‌ నాయుడు, పాసల కృష్ణ్ణ, రొంగళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దత్తిరాజేరు: మండలంలోని కె.కొత్తవలస, కె.కృష్ణాపురం, పెదకాద, దత్తి గ్రామాల్లో టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చప్ప చంద్రశేఖర్‌, మరడ రాము పాల్గొన్నారు.

➡️