రోడ్డు నిర్మాణాలు కోరుతూ టిడిపి, జనసేన ఆందోళన

Feb 4,2024 16:00 #Dharna, #eleswaram, #Kakinada
  • రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణం

ప్రజాశక్తి-ఏలేశ్వరం(కాకినాడ) : శిథిల వ్యవస్థకు చేరుకున్న రోడ్ల నిర్మాణాలు కోరుతూ టిడిపి, జనసేన ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్‌ వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో తూర్పు లక్ష్మీపురం నుండి రమణయ్యపేట వరకు నాలుగు కిలోమీటర్ల మేర శిధిలా వ్యవస్థకు చేరుకున్న రోడ్డుపై పాదయాత్ర నిర్వహించి, అడ్డంగా గోడ నిర్మించి బైటాయింపు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏజెన్సీ ముఖ ద్వారమైన ఏలేశ్వరం జే అన్నవరం రహదారి శిధిలావస్థకు చేరుకున్న పట్టించుకునే నాధుడే లేరన్నారు. అనునిత్యం ఈ రహదారి గుండా పెద్ద ఎత్తున వాహనాలు ఏజెన్సీ ప్రాంతాలకు ప్రయాణిస్తాయన్నారు. ఈ రహదారి ప్రయాణాలకు అనుగులేకపోవడంతో అనుమిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. అనేక వాహనాలు మరమ్మతులు గురి ఎక్కడికక్కడ నిలిచిపోతుండడంతో ప్రజల తీవ ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోల్లో బస్సుల్లో ప్రయాణికులు సైతం దిగి ఆందోళనలో పాల్గొన్నారు. మూడు కిలోమీటర్ల కు పైగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు చేరుకుని ఆందోళన విరమించవలసిందిగా కోరిన రోడ్లు నిర్మాణం ఎప్పుడు చేపడతారు పురాతపూర్వకంగా అధికారులు తెలిపే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. ప్రయాణికులు వద్ధులు చిన్నపిల్లలు ఎండలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని బ్రతిమలాడటంతో ఆందోళన విరమించారు. టిడిపి జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్డు నిర్మాణం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️