టిడిపి ఎస్సి సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా చిన్నం, పెదపూడి

Jan 21,2024 15:03 #Konaseema, #TDP

ప్రజాశక్తి – అంబాజీపేట(కోనసీమ) : టిడిపి ఎస్సి సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా అంబాజీపేట మండలం ఇరుసుమండకు చెందిన చిన్నం బాల విజయారావు, కె.పెదపూడికి చెందిన పెదపూడి శ్రీనివాసరావులను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెంనాయుడు ఆదివారం నియామక ఉత్తర్వులు పంపించారు. తమ సేవలను గుర్తించి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెంనాయుడులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకం ఉంచి రాష్ట్ర కమిటీ లో స్థానం కల్పించడంలో ఎస్సీ లు అందరూ టిడిపి మద్దతు ఇచ్చేలా కృషి చేస్తామని పేర్కోన్నారు. టిడిపి బలోపేతానికి 2024 అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థుల విజయానికి శాయిశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమకు సహకరించిన రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

➡️