మూలపడ్డ వ్యవసాయ మార్కెట్‌ మినీ రైతు బజార్‌

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : చాగల్లు గ్రామంలో ఒళ్లుగుంట దుర్గమ్మ గుడి వద్ద గత తెలుగుదేశం ప్రభుత్వంలో కొవ్వూరు వ్యవసాయ మార్కెట్‌ అనుబంధంగా చాగల్లుహొ గ్రామంలో వ్యవసాయ మార్కెట్‌ మినీ రైతు బజార్‌ గా రూ.15 లక్షల 43 వేలు నిధులతో 2015 డిసెంబరు ఆరో తేదీన అప్పుడే మంత్రి నారా లోకేష్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. తర్వాత 2019 వైఎస్‌ఆర్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ మార్కెట్‌ మినీ బజారు వాడకం లేక మూతపడి ఇతరులు అక్కడే వ్యాపారం చేసుకుంటున్నారు. వ్యవసాయ మార్కెట్‌ అనుబంధంగా ఎవరికైనా అద్దెకిస్తే ఏఎంసీకి ఆదాయం వస్తుంది కదా అని స్థానికులు చర్చించుకుంటున్నారు.

➡️