కాలువలో పడిన కారు

May 11,2024 15:56 #bapatla, #car accident

ప్రజాశక్తి-కారంచేడు(బాపట్ల) : కారంచేడు వద్ద ఆంజనేయస్వామి బొమ్మ సమీపంలో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయింది. శనివారం చీరాల నుంచి కారంచేడు వైపు అతివేగంగా వచ్చిన ఒక కారు అదుపుతప్పి కారంచేడు రోడ్డులోని ఆంజనేయ స్వామి బొమ్మ వద్ద కాలువలో బోల్తా పడింది. వెంటనే స్పందించిన స్థానిక ప్రజలు కారులోని ఇద్దరి వ్యక్తులను సురక్షితంగా బయటికి తీశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. యువకుల సహాయంతో కారును కాలువలో నుంచి బయటికి తీశారు.

➡️