కేంద్ర ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టాలి

ప్రజాశక్తి -హనుమంతుని పాడు : కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వర్యం చేసేందకు కుట్ర చేస్తుందని, దాన్ని కూలీలందరూ ఐక్యంగా ప్రతికటించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు తెలిపారు. మండల పరిధిలోని పాపిరెడ్డిపల్లి, మంగంపల్లి, వాలిచర్ల, పెదగొల్లపల్లి, తూర్పుపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉపాధి పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగాఉపాధి హామీ పథకం నిధుల్లో కోత పెడుతున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకే నిధుల్లో కోత పెడుతున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది కూలీలు ఉపాధి పనులపై ఆధారపడి జీవిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్‌ సంస్థలకు సబ్సిడీల కింద లక్షల కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉపాధి నిధుల్లో కోత పెట్టడం దారుణమన్నారు పాలకులకు కార్పొరేట్‌ సంస్థల పట్ల ఉన్న ప్రేమ పేదల పట్ల లేదని విమర్శించారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపాధి కూలీలందరూ ఐక్యమత్యంతో ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ప్రతి జాబ్‌ కార్డుదారుడికి 200 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. రోజు వారీ రూ.600 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు, మేట్లు పాల్గొన్నారు.

➡️