అరాచక ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి : మాజీ మంత్రి అమర్నాథరెడ్డి

Jan 23,2024 16:52 #chitoor, #v.kota

ప్రజాశక్తి-వి.కోట(చిత్తూరు) : రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టడానికి రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర మాజీమంత్రి అమరనాథరెడ్డి తెలిపారు. మండల కేంద్రమైన వి కోటలో టిడిపి మండల బీసీ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జయహౌ బిసి కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి ఆవిర్భావం నుండి బీసీలు పార్టీ ఎదుగుదలకు అండగా ఉంటు ఆదరిస్తున్నారని కొనియాడారు. బిసిలు అంటే బ్యాక్‌ వార్డ్‌ క్యాస్ట్‌ కాదని టిడిపి బ్యాక్‌ బోన్‌ అని అందరూ గుర్తించాలన్నారు. రాష్ట్రంలో బీసీలకు గుర్తింపుని ఇచ్చింది నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నే అని ప్రతి ఒక్క బిసి గ్రహించాలన్నారు. జగన్మోహన్‌ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓటమిని ముందే ఊహించి ఎమ్మెల్యేలను బదిలీ చేసే పనిలో పడ్డారని ఓటమి భయంతోనే ఎమ్మెల్యేల బదిలీలు చేసి కొత్త ముఖాలను ప్రవేశపెట్టి మళ్ళి ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఎద్దేవ చేశారు. టిడిపి జనసేన పొత్తు చారిత్రాత్మకమని ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ కు చాలా అవసరమన్నారు .ఈ పొత్తు రెండు పార్టీల వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకుంది కాదని ఐదు కోట్లమంది ఆంధ్రుల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకున్నదని ప్రజలు గ్రహించారని తెలియజేశారు. ప్రజలందరూ ముందుకు వచ్చి అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా . తెలుగుదేశం తో కలిసి వస్తే ఈ వైకాపా అరాచక ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోతుందన్నారు. జగన్మోహన్‌ రెడ్డి అహంకారానికి తెలుగుప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటానికి ప్రజా మద్దతు అవసరమన్నారు. 2024లో ఆంధ్రప్రదేశ్లో మార్పు తద్యమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరిగి ఎన్నికైతే ప్రజలు సురక్షితంగా ఇండ్ల లో కూడా ఉండే పరిస్తితి ఉండదన్నారు. గత ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చేందుకు ఇష్టానుసారం హామీలను గుప్పించడం తోనే నేడు అంగన్వాడీలు మొదలు ఉద్యోగ సంఘాలు రోడ్లు పైకి వచ్చే దుస్థితి నెలకొందన్నారు. రాబోవు కాలంలో బిసి వర్గాలకు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం కల్పిస్తుందిని వారి ఉన్నతకి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. అంతకుమునుపు వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేతలు రామచంద్రనాయుడు, రంగనాథ్‌ , నాగభూషణం,రాంబాబు, ఈశ్వర్‌ గౌడ్‌,చౌడప్ప, సోమశేఖర్‌,గోపీనాథ్‌, విశ్వనాథ్‌, నాగరాజు,మురుగేశ్‌, డి యన్‌ కుమార్‌,చిట్టిబాబు, గోపాలు పెద్ద ఎత్తున బిసి నేతలు తెలుగుదేశం పార్టీ కార్యకర్త పాల్గొన్నారు.

➡️