ఆరోగ్య సురక్ష క్యాంపును సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి

Mar 19,2024 16:45 #East Godavari, #undragavaram

ప్రజాశక్తి – ఉండ్రాజవరం: ఆరోగ్య సురక్ష క్యాంపుకు వచ్చిన ప్రతి పేషెంట్ కు వైద్య పరీక్షలు చేసి, అవసరమైన మందులు ఇచ్చి పంపాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కే. వేంకటేశ్వర రావు అన్నారు. మంగళవారం తాడిపర్రులో నిర్వహించిన ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆయన సందర్శించి, అధికారులకు తగు సూచనలిచ్చారు. క్యాంప్ కి వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్ లను రిఫరల్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా శస్త్ర చికిత్సలు అవసరమైతే ఆరోగ్య శ్రీ సేవలు కోసం నెట్ వర్క్ హాస్పిటల్ కి పంపాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో పి.హెచ్.సి వైద్యాధికారులు డాక్టర్ ఆర్‌ఎస్‌ఎస్‌వి ప్రసాద్, డాక్టర్ ఆర్. ఉషా దేవి, కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్, ఎం.సుబ్రహ్మణ్యం, ఆరోగ్య పర్యవేక్షకులు జే.శ్రీనివాసరావు , నాగమణి, ఆరోగ్య సిబ్బంది, ఎం‌ఎల్‌హెచ్‌పి లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️