వైసిపితో యువత భవిష్యత్తు నాశనం

May 10,2024 20:44

ప్రజాశక్తి- శృంగవరపుకోట : జగన్‌ చేతకాని తనంతో ఎపి యువత భవిష్యత్తు నాశనమైందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితకుమారి అన్నారు. శుక్రవారం మండలంలోని శివరామరాజుపేట, కొత్తూరు, ఎస్‌.కోట టౌన్‌ గవర వీది,ó యాత వీధి, కోట వీధిలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని మాట్లాడారు. బాబు సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కూటమి ప్రభుత్వం రాబోయే ఆవశ్యకత గురించి వివరించారు. ఆమె మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్‌ రెడ్డి లూటీ చేసాడని మద్యం, ఇసుక కుంభకోణాలతో రాష్ట్రాన్ని దేశంలో అవినీతిలో ముందు వరసలో ఉంచాడని మండిపడ్డారు. గ్రామాలకు తారు రోడ్డు, ఇంటింటికి తాగునీరు, పక్క గృహాలు ఇచ్చే బాధ్యత తనదని చెప్పారు. ఈ ఎన్నికల్లో రెండు ఓట్లును సైకిల్‌ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనని, ఎమ్‌పిగా ఎం.శ్రీభరత్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరి సుధారాణి, జనసేన ఇంఛార్జి సత్యనారాయణ, టిడిపి, బిజెపి, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.గాడి తప్పిన పాలన: టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయనరామభద్రపురం: రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన అన్నారు. శుక్రవారం మండలంలోని బూసాయవలస, ముచ్చర్లవలస, కొండకెంగువ, జన్నివలస లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దదిక్కుగా చంద్రబాబు రావడం అత్యవసరమన్నారు. ప్రతీ ఓటరు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు చింతల రామకృష్ణ, మడక తిరుపతి నాయుడు, కర్రోతు తిరుపతిరావు, కనిమెరక శంకరరావు, కంచుపల్లి సుజాత, యోగినాయుడు పాల్గొన్నారు.

➡️