పేస్ లో ముగిసిన గూగుల్ ఆండ్రాయిడ్ టెక్ క్యాంప్ వర్క్ షాప్

Jun 16,2024 16:28 #btech student, #ongle district

ప్రజాశక్తి-టంగుటూరు : పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో గూగుల్ ఆండ్రాయిడ్ టెక్ క్యాంప్ వర్క్ షాప్ ముగిసింది. ఈ వర్క్ షాప్ లో Eduskills సంస్థ నుండి మిస్టర్ పవన్ కుమార్ గూగుల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ట్రైనర్ గా హాజరయ్యి స్టూడెంట్స్ కి ఉపయోగపడేలా మంచి టెక్నికల్ నాలేజ్ ని అందించారు .ఈ టెక్ క్యాంపు వలన పేస్ కళాశాల ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లేటెస్ట్ టెక్నాలజీలో ఒకటైన గూగుల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ సంబంధించి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ని ఉపయోగించి మొబైల్లో అప్లికేషన్ ఎలా డెవలప్ చేయాలో క్లుప్తంగా నేర్చుకున్నారు మరియు అలాగే ఆ అప్లికేషన్స్ ని మొబైల్లో ఎలా రన్ చేయాలో ప్రాక్టికల్ గా కూడా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ఇలాంటి టెక్ క్యాంపులు వలన స్టూడెంట్స్ కి అడ్వాన్స్ టెక్నాలజీలో మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ కలిగించడం ద్వారా పెద్ద ప్యాకేజీలతో క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో సెలెక్ట్ అవటానికి దోహదపడతాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీకే మూర్తి , డీన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ కే రూప అక్కేష్, డీన్ స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ ఆర్ వీరాంజనేయులు, కళాశాల ప్లానింగ్ అండ్ ఎవల్యూషన్ డైరెక్టర్ డాక్టర్ టీ రామ చైతన్య, అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొని వర్క్ షాప్ ని విజయవంతం చేశారు.

➡️