ఉపాధి కూలీలకు పనుల దగ్గర సౌకర్యాలు కల్పించాలి : వ్యకాస

ప్రజాశక్తి-గూడూరు(కర్నూలు) : ఉపాధి కూలీలకు పెండింగ్‌ వేతనాలు చెల్లించి.. పనుల దగ్గర సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.వెంకటరాముడు డిమాండ్‌ చేశారు. మంగళవారం గూడూరు మండలం గుడిపాడు గ్రామంలో ఉపాధి పనులను పరిశీలించారు. ఎర్రటి ఎండలో పనులు చేస్తున్న కూలీల సమస్యలు, తెలుసుకున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.వెంకటరాముడు మాట్లాడుతూ.. మార్చి మొదటి వారంలోనే ఇంత ఎండలు వుంటే మాగవాసంలో ఎండలు ఏవిందగ వుంటాయో అని వ్యవసాయ కూలీలు బెంబేలు ఎత్తుతున్నారని తెలిపారు. ప్రభుత్వాలకు చిత్త శుద్ధి వుంటే పనుల దగ్గర నీడ వసతి కల్పించి మజ్జిగ పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోడానికి మీరందరూ ఐక్యమత్యం కావాలని వారు పిలుపునిచ్చారు. 10 వారాల పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని, 100 రోజులు ఐయిపోయిన కుటుంబాలకు అధనంగ పనులు కల్పించి వలసలు ఆపాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే వ్యవసాయ కూలీలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం అధ్యక్ష కార్యదర్శులు సి.పాపన్న, కె.లక్షి రెడ్డి, ఉపాధ్యక్షులు లక్ష్మన్న, సహాయకార్యదర్శి సోమన్న, కోశాధికారిగా కేశవరెడ్డి, సభ్యులు కలావతమ్మ, అయ్యామ్మ, సుంకులమ్మా, నారాయణ, శ్రీరాములు, రంగన్న, రాజశేఖరెడ్డి, ఆదికేశవులు, అరుణకుమారి, కూలీలు పాల్గొన్నారు.

➡️