ఉపాధి సిబ్బంది పనితీరు మార్చుకోవాలి

ప్రజాశక్తి-త్రిపురాంతకం: త్రిపురాంతకం మండలంలోని కేసినేనిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ అర్జున్‌రావు శుక్రవారం పరిశీలించారు. ముందుగా పని నిర్వహిస్తున్న ప్రదేశాన్ని, అక్కడ ఉపాధి హామీ సిబ్బంది కూలీలకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. అనంతరం కూలీల హాజరు పట్టికను పరిశీలించారు. ఎండలు అధికంగా ఉన్నాయని ప్రతి ఒక్కరూ పనిచేసే సమయంలో తలకు కండువా, టోపీ ధరించాలని సూచించారు. పనికి వచ్చే సమయంలో ప్రతి ఒక్కరూ మంచినీటిని తెచ్చుకోవాలని కోరారు. ఉపాధి హామీ సిబ్బంది తప్పక తమ విధులను నిర్వహించాలని అన్నారు. ఎవరైనా అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపిఓ సుజాత, ఈసి వెంకటేశ్వరరెడ్డి, టిఎలు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

➡️