పోరాటాంతోనే సమస్య పరిష్కారం

Apr 20,2024 20:50

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మిమ్స్‌ ఉద్యోగులు పోరాటం ద్వారా తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించుకొని విజయం సాధించారని ఎక్కడైనా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని మిమ్స్‌ ఎంప్లార ుుస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టి.వి.రమణ అన్నారు. మిమ్స్‌ ఉద్యో గులు, కార్మికులు గత 80 రోజులుగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ నిరశన పోరాటం శిబిరం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిమ్స్‌ యాజమాన్యం దిగి వచ్చి డిఎ బకాయిలు చెల్లించడానికి, వేతన ఒప్పందం చేయడానికి, కాంట్రాక్టు ఉద్యోగులకు చట్ట ప్రకారం వేతనాలు ఇవ్వడానికి, ఎటువంటి వేధింపులూ బదిలీలు చేయమని, కేసులు ఉపసం హరించుకుంటామని అగ్రిమెంట్‌ చేయడ ంతో శనివారం నుంచి ఉద్యోగులు కార్మికు లు విధులకు హాజరయ్యారు. ఈ సందర్భ ంగా మిమ్స్‌ గేటు వద్ద మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షు లు టి.వి.రమణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ మాట్లాడుతూ ఐక్య పోరాటాలతో మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు న్యాయ మైన సమస్యల పరిష్క రించుకుని విధుల్లో చేరడం శుభపరిణా మం అన్నారు. ఉద్యోగులు, కార్మికులు ఎన్ని అవాంతరాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో పోరాడి తమ హక్కులు సాధిం చుకున్నారని తెలిపారు. ఐక్యంగా ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కారం చెసు కోవచ్చని మిమ్స్‌ ఉద్యోగులు నిరూపిం చారని గుర్తు చేశారు. పోరాట సమయ ంలో మిమ్స్‌ ఉద్యోగులను ఎన్నో ఇబ్బం దులు పెట్టినప్పటికీ పట్టు సడలకుండా అందరూ ఒకే మాట మీద నిలబడి వారు కోరుకున్న విధంగా డిమాండ్లు సాధించు కున్నారన్నారు. భవిష్యత్తులో ఈ పోరా టాన్ని స్పూర్తిగా తీసుకొని ఐక్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపు నిచ్చారు. ఉద్యోగులకు సిఐటియు వెన్ను దన్నుగా నిలిచి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి మిరప నారాయణ, నాయకులు కె.కామునాయుడు, ఎం.నాగ భూషణం, గౌరి, వరలక్ష్మి, మూర్తి, బి.బంగారునాయుడు, కె.మధు, ఎం.రాం బాబు, మూర్తి, అప్పలనాయుడు, రమణ తదితరులు పాల్గొన్నారు.

➡️