రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలి

  • కోటలో నిరాహార దీక్ష చేపట్టిన అంగనవాడీ ఉద్యోగులు

ప్రజాశక్తి -కోట(తిరుపతి) : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్వాడీలు అంగన్వాడీ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద గురువారం నిరాహార దీక్ష చేపట్టారు.ఈ సందర్బంగా గురువారం కోట మండలంలోని స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద కోటా వాకాడు చిట్టమూరు మండలాల అంగనవాడి ఉద్యోగస్తులు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది.ఈ నిరాహార దీక్షలో అంగన్వాడి ఉద్యోగస్తులు సునీతమ్మ,సునీతమ్మ,రాధా, సుందరమ్మ,శాంతి, పలువురు నిరాహార దీక్షలో పాల్గొన్నారు.అనంతరం కోట,వాకాడు,చిట్టమూరు మండలాల అధ్యక్షురాలు పద్మలీలమ్మ మాట్లాడుతూ అనేక ఏళ్లుగా తమ సమస్యలను పదే పదే మొరపెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని లేకుంటే పోరాటం మరింత ఉధృతంగా చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు పద్మలీలమ్మ, సరోజిని,అంగన్వాడి ఉద్యోగస్తులు పాల్గొన్నారు.

➡️