తాగునీటి సరఫరా సక్రమంగా లేదు .. చెత్త కుప్పలూ తొలగించట్లేదు

 మాచర్ల: మున్సిపల్‌ అధికారుల పనితీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజు మార్చి రోజు ఇచ్చే తాగునీటిని మూడు రోజులకు ఒకసారి ఇవ్వడంపై ప్రజలు మండి పడుతున్నారు. పట్టణంలోని వీధుల్లోని చెత్తకుప్పలను కూడా ప్రతి రోజు తొలగించే విష యమై అధికారులు అశ్రద్ధ తగదని ప్రజలు అంటు న్నారు. ఈ రెండూ అత్యవసర సేవలని, వీటిపై కూడా ప్రత్యేక శ్రద్ధ కన బరచకపోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాగు నీటి సరఫరాను మెరుగు పరచాలని, ఈ విషయమై సం బంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిలో ఉండే చెత్త కుప్ప లను కూడా ప్రతిరోజూ తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

➡️