టిడిపితోనే పేదల సంక్షేమం : గొట్టిపాటి

ప్రజాశక్తి-దర్శి : టిడిపితోనే పేదల సంక్షేమం సాధ్యమని టిడిపి దర్శి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. దర్శి పట్టణంలోని 6, 7వ వార్డుల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ లక్ష్మి మాట్లాడుతూ తనను ఆదర్శిస్తే దర్శి నియోజకవర్గానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో దర్శి ఎమ్మెల్యేగా తనను, టిడిపి ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డిని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, టిడిపి పట్టణ అధ్యక్షుడు యాదగిరి వాసు, రాష్ట్ర మహిళా నాయకులు శోభారాణి, దారం సుబ్బారావు, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️