పేదల సంక్షేమమే థ్యేయం

ప్రజాశక్తి-కురిచేడు : పేదల సంక్షేమమే థ్యేయంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు జడ్‌పి చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. మండల కేంద్రమైన కురిచేడులో బూచేపల్లి నందినితో కలిసి వెంకాయమ్మ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకాయమ్మ మాట్లాడుతూ తన సుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దర్శి నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కురిచేడు మండలంలోనూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అందరి మన్ననలు పొందినట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ మండల కన్వీనర్‌ మేరువ సుబ్బారెడ్డి, కురిచేడు సర్పంచి కేశనపల్లి కృష్ణయ్య. జడ్‌పిటిసి నుసుం వెంకట నాగిరెడ్డి, కురిచేడు ఎంపిటిసి బుల్లం వెంకట నరసయ్య, ఆవుల లక్ష్మీదేవి, వైసిపి మండల కన్వీనర్‌ యన్నాబత్తిన సుబ్బయ్య, గోగులమూడి లింగారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

➡️