రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదు

ప్రజాశక్తి-కమలాపురం /వల్లూరు/చెన్నూరు/సి.కె. దిన్నె/పెండ్లిమర్రి కడప ఉక్కు పరిశ్రమ తన తండ్రి వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి కల అని, ప్రాజెక్టు పూర్తయింటే 25 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని సిఎం జగన ్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపనలకే పరిమితం చేశారని పిసిసి అధ్యక్షులు వై.ఎస్‌. షర్మిల అన్నారు. ఆదివారం వైఎస్‌ఆర్‌ జిల్లా కమలాపురం నియోజక వర్గంలో మూడో రోజు బస్సుయాత్ర సాగింది. నియోజకవర్గంలోని కమలా పురం, పెండ్లి మర్రి, విఎన్‌.పల్లె, సికెదిన్నె, వల్లూరు చెన్నూరు మండలాల్లో పర్యటించారు. ముందుగా ఆమె పెండ్లిమర్రిమండలం యాదవపురం గ్రామంలో వారం రోజుల కిందట హత్యకు గురైన ఆదిమూలం శ్రీనివాస్‌యాదవ్‌ కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి చిత్రపటానికి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని ఆమె హామీ ఇచ్చారు. శ్రీనివాస్‌యాదవ్‌ను అత్యంత దారుణంగా హత్య చేసి కాల్చేశారని పేర్కొన్నారు. నిందితులు ఎంపీ వై.ఎస్‌. అనినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి ముఖ్య అనుచరులేనన్నారు. కేసులో ఓ ఎస్‌ఐని సస్పెండ్‌ చేసి సరి పెట్టుకున్నారని వాపోయారు. హత్యచేసిన వారిని అధికార పార్టీ నాయకులు కాపాడుతున్నారని చెప్పారు. తహశీల్దార్‌, పోలీసులు కమ్ముక్కయ్యారని విమర్శి ంచారు. భూమి కోసమే అవినాష్‌రెడ్డి అనుచరులు హత్యచేశారని పేర్కొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలను ఓట్లు వేసి గెలిపించింది హత్యలు చేయడానికేనా, . ఇక్కడే ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రం అక్రమాలు, దౌర్జన్యాలు, హత్యలు, దోపిడీ లమయంగా మారిందన్నారు. ఇసుక, మైనింగ్‌ మాఫియా రాజ్యవే ులుతోందని విమర్శించారు. ఎక్కడా అభి వృద్ధి జరగలేదన్నారు. . వైఎస్‌ఆర్‌ హయంలోని పెండింగ్‌ ప్రాజెక్టులకు దిక్కులేదని వాపోయారు. ‘తెలంగాణాకు వెళ్లానని… ఇక్కడేమీ పని’ అని మా మేనమామ రవీంద్రనాథరెడ్డి అంటున్నారని పేర్కొ న్నారు. ‘అక్కడ ఒక నియంతని గద్దెదించడానికి వెళ్లాను.. దింపాను.. అక్కడ నా పని పూర్తయ్యింది… ఇప్పుడు ఇక్కడ నాకు పని పడింది’ అని ఆమె అన్నారు. కడప ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి వారికి మళ్లీ ఓట్లు వేస్తే ఇలాంటి హత్యలే జరుగుతాయని చెప్పారు. వివేకా హత్య జరిగి ఐదేళ్లయినా ఇంతవరకు హంతకులకు శిక్ష పడ లేదని వాపోయారు. హత్యచేసిన వాళ్లు యథే చ్ఛగా బయట తిరుగుతున్నారని, అధికారం అడ్డు పెట్టు కుని దర్జాగా తిరుగు తున్నారని, అన్ని ఆధారులున్నా చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అవినాష ్‌రెడ్డే హంతకుడని సిబిఐ చెప్పిందని, అలాంటి వ్యక్తికే జగన్‌ మళ్లీ టికెట్‌ ఇచ్చారని పేర్కొన్నారు. ఇది హత్యా రాజకీయాలను ప్రోత్స హించినట్లేనని చెప్పారు. వివేకానందరెడ్డి జగన్‌కు స్వయానా బాబాయి అయినా నిందితుడిని దగ్గరుండి మరీ కాపాడుతున్నారని తెలిపారు. నిందితులు చట్టస భల్లోకి వెళ్లకూడదనే తాను ఎంపీగా పోటీ చేస్తున్నానని ఆమె అన్నారు. ఒక వైపు ధర్మం, మరో వైపు డబ్బు ఉందని, ప్రజలు ఎవరిని గెలిపించాలో ఆలోచన చేయాలన్నారు. షర్మిలను చూస్తే వైఎస్‌ఆర్‌ గుర్తుకొస్తారు : సునీత తన తండ్రి వివేకానందరెడ్డి కోరిక షర్మిలను ఎంపీగా చూడాలని, ఆమెను చేస్తే వైఎస్‌ఆర్‌ గుర్తుకొస్తారని వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత అన్నారు. షర్మిలతో కలసి బస్సుయాత్రలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ పక్కా స్కెచ్‌తోనే తన తండ్రిని హత్య చేశారని పేర్కొన్నారు. వివేకా హత్య విషయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అర్థం లేని మాటలు మాట్లాడు తున్నారని పేర్కొన్నారు. తన తండ్రిని చంపితే తనకు పర్షనల్‌ విషయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాధ్‌రెడ్డి మాటలూ విడ్డూరంగా ఉన్నాయన్నారు.

➡️