ఇవిఎంల వద్ద మూడు అంచెల భద్రత++

ప్రజాశక్తి-శింగరాయకొండ : టంగుటూరు మండలం వల్లూరు సమీపంలోని రైస్‌ కష్ణ సాయి ఇంజినీరింగ్‌ కళాశాలలో భద్రపరిచిన ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని ఇవిఎంలను కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ మంగళవారం స్ట్రాంగ్‌ రూములో పరిశీలించారు. కళాశాల లోని స్ట్రాంగ్‌ రూముల వద్ద ప్రతి రూముకి మూడంచెల భద్రతతో పోలీస్‌ నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఇవిఎంలను పూర్తిస్థాయిలో పరిశీలించి రూములో ఉంచి గదికి సీల్‌ వేసినట్లు తెలిపారు. స్ట్రాంగ్‌ రూములో భద్రత విషయంలో రాజీ పడేది లేదని తెలిపారు. అక్కడ మూడుంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒంగోలుకు ఇవిఎంల తరలింపు…ప్రజాశక్తి- మార్కాపురం మార్కాపురానికి సంబంధించిన ఇవిఎంలను మంగళవారం ఒంగోలుకు తరలించారు. మార్కాపురం మున్సిపాలిటీ, మార్కాపురం మండలం, తర్లుపాడు మండలం, కొనకనమిట్ల మండలం, పొదిలి మండలానికి సంబంధించిన ఎన్నికల సామగ్రిని సొమవారం రాత్రి మార్కాపురంలోని ఎస్‌వికెపి కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరించారు. నియోజకవర్గంలోని 257 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఇవిఎంలతో పాటు ఇవిప్యాడ్‌లను ఒంగోలులోని రైజ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌కు కంటైనర్‌ ద్వారా మంగళవారం తరలించారు. ఇవిఎం, ఇవిప్యాడ్ల తరలింపు సందర్భంగా గట్టి పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. తరలింపు ప్రక్రియను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాహుల్‌ మీనా పర్యవేక్షించారు. డిఎస్‌పి ఎం.బాలసుందరరావు, సిఐ ఆవుల వెంకటేశ్వర్లు, ఎన్నికల సహాయ అధికారి రవికుమార్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవిఎం, ఇవిప్యాడ్‌లను తరలిస్తున్న కంటైనర్‌తో పాటు బిఎస్‌ఎఫ్‌ బలగాలు, స్థానిక పోలీసులు బందోబస్తుగా వెళ్లారు.

➡️