అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలియూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వాడ గంగరాజు డిమాండ్‌

అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలియూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వాడ గంగరాజు డిమాండ్‌

అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలియూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వాడ గంగరాజు డిమాండ్‌ప్రజాశక్తి – పుత్తూరుటౌన్‌: రాష్ట్రంలో అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కారం కోసం 42 రోజులు సమ్మె చేసి వీరోచితమైన పోరాటం చేయడం జరిగింది. ఈ సందర్భంగా చివరలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం వెంటనే జీవోలు విడుదల చేయాలన శనివారం పుత్తూరులో అంగన్వాడీలకు జరిగిన శిక్షణ తరగతుల్లో ఏపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీలు చేసిన పోరాటం వీరోచితమైందని తెలిపారు. ప్రభుత్వం దిగివచ్చి చేసుకున్న అగ్రిమెంట్‌ ప్రకారం జీవోలు ఇవ్వకపోతే మళ్ళీ పోరుబాట పట్టాల్సి వస్తుందని తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక రైతువ్యతిరేక విధానాలపై కార్మికులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఐసిడిఎస్‌ను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతున్నదని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్మిక చట్టాలను రద్దు చేసి యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న అధికారపక్షం, ప్రతిపక్షం మద్దతు తెలపడం సిగ్గుచేటు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్‌కు నిధులు కేటాయించి అందులో పనిచేస్తున్న అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. సమ్మె సందర్భంగా జరిగిన ఒప్పందంలో ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టమని స్పష్టంగా చెప్పినప్పటికీ అధికారులు మాత్రం వర్కర్లపై రెట్టింపు స్థాయిలో కక్ష సాధింపు చర్యలు పాల్పడుతూ ప్రతి చిన్న విషయానికి సిడిపిఓ పర్మిషన్‌ తీసుకోవాలని అధికారులు చెప్పడం ఏమిటంటే ప్రశ్నించారు. అయితే మరి సూపర్వైజర్లు ఎందుకు అని ప్రశ్నించారు. వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని జీవోలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తిరుపతి జిల్లా సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటేష్‌, నగరి అధ్యక్ష ధనకోటి, కార్వేటినగరం అధ్యక్షురాలు లక్ష్మీనరసింహ, కార్యదర్శి పంచవర్మ పాల్గొన్నారు.

➡️