అంగన్‌వాడీల సమస్య పరిష్కరిస్తాంకుప్పం బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు

అంగన్‌వాడీల సమస్య పరిష్కరిస్తాంకుప్పం బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు

అంగన్‌వాడీల సమస్య పరిష్కరిస్తాంకుప్పం బహిరంగ సభలో చంద్రబాబు నాయుడుప్రజాశక్తి- గుడిపల్లి:కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్యే, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటనలో భాగంగా గుడిపల్లి మండలంలో గురువారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీ రాజ్యం పోవాలి.. ప్రజా ప్రభుత్వం రావాలని అంటే ప్రతిఒక్కరు సైనికులు లాగా తెలుగుదేశం పార్టీకి పనిచేయాలన్నారు. సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ పథకాలు మూడింతలు అందిస్తానని ఈ సైకో ప్రభుత్వం పది రూపాయలు సంక్షేమ అందించి నూరు రూపాయలు ప్రజల వద్ద దోచుకుంటుందని.. నూరు రోజులు ఆగితే మన ప్రభుత్వం వస్తుందని అన్నారు. కుప్పం నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరు అని, అలాంటి కుప్పం నియోజకవర్గంలో వైసిపి రౌడీ మూకల వలన ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వ భూములను అక్రమంగా క్వారీలను దోచుకుంటున్నారని ‘దోచుకో దాచుకో’ అనే చందంగా ఈ ప్రభుత్వం తయారైందని అన్నారు. రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం ద్వారా ఇచ్చే డ్రిప్‌ ఇరిగేషన్‌, గ్రీన్‌ హౌస్‌లు గానీ సబ్సిడీ రూపంలో ఇంతవరకు అందించిందా అని ప్రశ్నించారు. రోజురోజుకు రాష్ట్రంలో నిరుద్యోగ యువత పెరిగిపోయిందని ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో రౌడీ రాజ్యాన్ని కూకిటేళ్లతో అణిచివేస్తానని, ప్రభుత్వ ఉద్యోగులు ఏదో ఒక రూపంలో రోడ్డుల పైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని, ఇటీవల కాలంలో అంగన్వాడీ ఉద్యోగస్తులు తమ న్యాయమైన డిమాండ్‌ జీతాలు పెంచాలని వేడుకుంటుంటే వారిపై కూడా దాడులు చేసి తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే వారికి తప్పకుండా న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం సాయంత్రం 4గంటలకు జరగవలసి ఉండగా చంద్రబాబు ఐదు గంటలకు రావడంతో టిడిపి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ప్రజలు భారీగా ఆయన కోసం వేచి ఉండి ఈసభను జయప్రదం చేశారు. దీంతో ఆయన వారందరికీ కతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు పులివర్తి నాని, మండల పార్టీ అధ్యక్షులు టిఎం.బాబు నాయుడు, కుప్పం నియోజకవర్గం ఆర్‌.చంద్రశేఖర్‌, జనసేన పార్టీ అధ్యక్షులు అమీర్‌, నియోజకవర్గం ఎస్సీ సెల్‌ అధ్యక్షులు సుబ్రమణి, క్లస్టర్‌ ఇంచార్జ్‌ హేమంత్‌ గౌడ్‌, మాజీ జెడ్పిటిసి బెయేటప్ప నాయుడు పాల్గొన్నారు.

➡️