అంబేద్కర్‌కు నివాళి

అంబేద్కర్‌కు నివాళి

అంబేద్కర్‌కు నివాళిప్రజాశక్తి-తిరుపతి సిటి : రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన ”సామాజిక సమత సంకల్పం” కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక ఏపీఎస్‌ఆర్టిసి బస్టాండ్‌ సర్కిల్లోని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ విగ్రహానికి జిల్లా కలెక్టర్‌ కె.వెంకటరమణా రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, నగర పాలక సంస్థ కమిషనర్‌ హరిత పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం మానవహారంలో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డా. బి.ఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలతో సామాజిక న్యాయం అమలు చేస్తుందని అన్నారు. ఈనెల 19న ముఖ్యమంత్రి జగన్మోన్‌రెడ్డి విజయవాడలోని స్వరాజ్‌ మైదానంలో దాదాపు రూ.400 కోట్లతో 10 ఎకరాలలో అంబేద్కర్‌ స్మృతివనం ఏర్పాటుతో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని పెడస్టల్‌తో కలిపి 210 అడుగులతో ప్రారంభించనున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, బి.సి వెల్ఫేర్‌ అధికారి భాస్కర్‌ రెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ చంద్రమౌలీశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు.

➡️