ఇంటర్‌ సప్లిమెంటరీలో సాత్వికకు ప్రథమ స్థానం

ఇంటర్‌ సప్లిమెంటరీలో సాత్వికకు ప్రథమ స్థానంప్రజాశక్తి- బుచ్చినాయుడు కండ్రిగ: మండల కేంద్రమైన బుచ్చి నాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన సముద్రాల సాత్విక ఇంటర్‌ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఎంఈసీ గ్రూపులో 500 మార్కులకు 491 మార్కులు సాధించి ప్రథమ స్థానం సాధించడంతో సాధించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత మార్చిలో పరీక్షల్లో 484 మార్కులు వచ్చాయన్నారు. ఇంగ్లీష్‌, ఎకనామిక్స్‌ సబ్జెక్టుల్లో ఇంప్రూవ్‌మెంటు రాసిందన్నారు. నేడు విడుదల చేసిన ఫలితాల్లో ఈ రెండు సబ్జెక్టుల్లో 7 మార్కులు పెరగడంతో మొత్తం 491 మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు, మాజీ జెడ్‌పిటిసి సునీత సుధాకర్‌ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు.

➡️