ఆగని ఏనుగుల దాడులు

ఆగని ఏనుగుల దాడులు

ఆగని ఏనుగుల దాడులు ప్రజాశక్తి -రామచంద్రపురం ( చంద్రగిరి)తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచల అటవీ సమీప ప్రాంతాలలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మండలంలోని చిన్న రామాపురం పంచాయతీ పరిధిలో ఉన్న యల్లంపల్లి, మూలపల్లి, కొండ్రెడ్డి కండ్రిగ గ్రామాలలో అర్థరాత్రి పంట పొలాల పై పడి ధ్వంసం చేశాయి. పొలం దగ్గర కాపలా ఉన్న మనోహర్‌ రెడ్డి పై అకస్మాత్తుగా దాడి చేశాయి. తటిలో ప్రాణాపాయం నుంచి రైతు తప్పించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన రైతును అటవీ శాఖ అధికారులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.గత 20 రోజులుగా తరచూ రాత్రిళ్ళు సుమారు 17 ఏనుగుల గుంపు పంట పొలాలపై పడటంతో చేతికి అంది వచ్చిన పంట చేజారిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడులు భరించలేకపోతున్నామని ఎప్పుడు ఏ వైపు నుంచి దాడి చేస్తాయోనని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీశాఖా అధికారులు వారి సిబ్బంది 21మంది వారి ప్రయత్నం వారు చేస్తున్నా ఫలితం లేకుండా పోతుందని చెప్పారు. రైతులు గ్రామం వదిలి వెళ్లడం తప్ప మరో మార్గం కనిపించడం ఏదని వాపోతున్నారు. వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అన్నదాతలను పరామర్శించారు.

➡️