‘ఆడుదాం ఆంధ్ర’లో ఆడండి

'ఆడుదాం ఆంధ్ర'లో ఆడండి

‘ఆడుదాం ఆంధ్ర’లో ఆడండిప్రజాశక్తి- శ్రీకాళహస్తి అతిపెద్ద క్రీడా వేదికనా ఆడుదాం- ఆంధ్రాలో ఆడి యువత తమ సామర్ధ్యాలను వెలికితేయాలని స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి అన్నారు. ఆడుదాం-ఆంధ్ర క్రీడల పోటీలపై అవగాహన కల్పించడంలో భాగంగా స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నుంచి 2కే రన్‌ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం యువతకు మంచి అవకాశమన్నారు. ప్రస్తుతం యువతలో ఫిజికల్‌ ఫిట్నెస్‌ సరిగ్గా ఉండడం లేదనీ, ప్రతిఒక్కరికి ఇది ఒక చక్కటి అవకాశం అని తెలిపారు. ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద క్రీడా సంబరమనీ, గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆడుదాం ఆంధ్రలో యువ క్రీడాకారులందరూ పాల్గొని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు. దేవస్థానం చైర్మన్‌ అంజూరు తారక శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు పగడాల రాజు, ముత్యాల పార్థసారథి, బోర్డు మెంబర్స్‌ మున్నా, జయశ్యం, మార్కెట్‌ కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ లక్కమనేని కష్ణ, తిరుకాల మల్లికార్జున్‌ గౌడ్‌, రాము గుప్తా, ఆర్కడు, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.తిరుపతి సిటీ: ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు జిల్లా క్రీడాభివద్ధిశాఖ అధికారి ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నుంచి టౌన్‌ క్లబ్‌ మీదుగా, మహతి ఆడిటోరియం నుంచి, తిరిగి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వరకు ప్రదర్శన సాగింది. ఈకార్యక్రమాన్ని తిరుపతి జిల్లా ఒలంపిక్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షులు ఎలమంచిలి ప్రవీణ్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రవీణ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అద్భుతమైనదని, ఈ కార్యక్రమం ద్వారా వార్డుస్థాయి నుంచి గ్రామస్థాయి, మండల ,కాన్స్టెన్సీ జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి వరకు ఉచిత శిక్షణ ఇస్తారన్నారు. స్ఫూర్తిని నింపే ఈ కార్యక్రమంలో ఎంతోమంది క్రీడాకారులు ప్రతిభ బయటపడుతుందని అన్నారు. దీని ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు బయటపడతారని పేర్కొన్నారు. షాప్‌ శిక్షకులు, డిఎస్డిఎస్‌ సయ్యద్‌ సాహెబ్‌ మాట్లాడుతూ దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 1,50,000 మంది క్రీడాకారులు ఇందులో నమోదు చేసుకున్నారని, వారందరికీ క్రీడా దుస్తుల్ని పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో శాప్‌ శిక్షకులు చక్రవర్తి, గోపి, వినోద్‌, లక్ష్మీకరణ, శశి, హిందూజా, నీలిమ, ప్రేమ్‌, వినోద్‌ డీఈవో శేఖర్‌, స్కూల్‌ గేమ్స్‌ సెక్రెటరీ విజయ కుమారి, జెన్‌ స్పోర్ట్స్‌ అకాడమీ కిరణ్‌ కుమార్‌, వివిధ స్కూల్స్‌, కాలేజీల పీడీలు, పీఈటిలు, మున్సిపల్‌ కార్పొరేటర్స్‌, కోఆప్షన్‌ మెంబర్స్‌, విద్యార్థులు క్రీడాకారులు పాల్గొన్నారు.

➡️