ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలిప్రత్యేక ప్రతిభావంతులకు యూత్‌ హాస్టల్లో ఆటల పోటీలు

ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలిప్రత్యేక ప్రతిభావంతులకు యూత్‌ హాస్టల్లో ఆటల పోటీలు

ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలిప్రత్యేక ప్రతిభావంతులకు యూత్‌ హాస్టల్లో ఆటల పోటీలుప్రజాశక్తి – తిరుపతి సిటి సమాజంలో ప్రత్యేక ప్రతిభావంతులు వివక్షకు గురవుతున్నారని, కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని రాస్‌ ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం అన్నారు.యూత్‌ హాస్టల్లో ప్రత్యేక ప్రతిభావంతులకు బాలోత్సవం ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నడ్డి నారాయణ అధ్యక్షత వహించారు. బాలోత్సవం గౌరవ అధ్యక్షులు టెంకాయల దామోదరం, వ్యవస్థాపకులు మల్లారపు నాగార్జున మాట్లాడుతూ మానసిక వికలాంగులను కంటికి రెప్పలా కాపాడుతున్న నిర్వాహకులను అభినందించారు. మానసిక వికలాంగుల నిర్వహణ కేంద్రాలైన రాస్‌, పాస్‌, మనోవికాస్‌, బ్లూమాస్‌, అక్షయక్షేత్రం, అభయక్షేత్రం, భవిత కేంద్రాల నుంచి ఈ పోటీల్లో 200 మంది పాల్గొన్నారు. నిర్వాహకులు విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ, బాలకృష్ణమూర్తి, ప్రముఖ న్యాయవాది మట్టా పురుషోత్తమరెడ్డి, రోటరీ అధ్యక్షులు రాజకుమార్‌, చలపతి, మునిలక్ష్మి, తహసున్నీసా, ముఖేష్‌, రెడ్డెప్ప, రఫీ, ఒ.వెంకటరమణ పాల్గొన్నారు. ప్రథమ చికిత్స కేంద్రాన్ని సంకల్ప ఆస్పత్రి వారు ఏర్పాటు చేశారు.

➡️