ఆరోగ్య సంరక్షణలో అగ్రగామి ఆయుర్వేదం

ఆరోగ్య సంరక్షణలో అగ్రగామి ఆయుర్వేదం

ఆరోగ్య సంరక్షణలో అగ్రగామి ఆయుర్వేదంప్రజాశక్తి – క్యాంపస్‌ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం యూనిట్‌ 3 కుంట్రపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక సేవా శిబిరంలో భాగంగా శనివారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం జరిగింది. ఆయుర్వేద ఆస్పత్రి పంచకర్మ స్పెషలిస్టు రవి, క్షారసూత్రా స్పెషలిస్టు డాక్టర్‌ శ్రీ జ్యోస్న ఆయుర్వేదంపై అవగాహన కల్పించి, ఉచిత మందుల పంపిణీతో పాటు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. ఆయుర్వేదం జీవనశైలి సహజమైన రోగ నిరోధక శక్తిని పెంచడంపై దృష్టి పెడుతుందన్నారు. సరైన నిద్ర వ్యాధులలో సగం నయం చేస్తుందని, మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో, అతినంత నిద్ర అంతే ముఖ్యమన్నారు. ఆరోగ్యవంతుడు రోజుకు కనీసం ఆరు గంటలు నిద్ర పోవాలన్నారు. ప్రోగ్రం అధికారిణి నీరజ, సర్పంచి శుభా పద్మనాభం రెడ్డిపాల్గన్నారు.

➡️