ఆర్‌టిసి బస్సును ఢకొీన్న లారీ ముగ్గురికి స్వల్ప గాయాలు

ఆర్‌టిసి బస్సును ఢకొీన్న లారీ ముగ్గురికి స్వల్ప గాయాలు

ఆర్‌టిసి బస్సును ఢకొీన్న లారీ ముగ్గురికి స్వల్ప గాయాలుప్రజాశక్తి- చిట్టమూరు:ఆర్‌టిసి బస్సును లారీ ఢకొీన్న ప్రమా దంలో ముగ్గురు ప్రయాణి కులు స్వల్పంగా గాయపడిన సంఘటన మండలంలో శనివారం చోటు చేసు కుంది. మండల పరిధిలోని బయ్య వారి కండ్రిగ రోడ్డు వద్ద నాయుడుపేట నుండి మల్లాం వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులను దించేందుకు ఆగింది. వెనుకనే వేగంగా వచ్చిన లారీ బస్సు వెనుక భాగంలో ఢకొీంది. బస్సు అద్దాలు పగిలి వెనుక సీట్లలో కూర్చున్న ముగ్గురిపై పడటంతో స్వల్పం గా గాయపడ్డారు. గాయపడిన వారిని 108 సాయంతో పల్లాం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్వల్ప గాయాలతో బయట పడడంతో పెను ప్రమాదం తప్పిందని బస్సులో ప్రయాణిస్తున్న 48 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న చిట్టమూరు ఎస్‌ఐ టి బలరామయ్య లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️