ఆర్టీసీ ఎస్‌డబ్యుఎఎఫ్‌ మహిళా కన్వీనర్‌గా భాగ్యలక్ష్మి

ఆర్టీసీ ఎస్‌డబ్యుఎఎఫ్‌ మహిళా కన్వీనర్‌గా భాగ్యలక్ష్మి

ఆర్టీసీ ఎస్‌డబ్యుఎఎఫ్‌ మహిళా కన్వీనర్‌గా భాగ్యలక్ష్మి ప్రజాశక్తి-శ్రీకాళహస్తి అన్ని రంగాల్లో స్త్రీ పురుష సమానత్వం రావాలని, లింగ వివక్ష రూపుమాపాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య పిలుపునిచ్చారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌ లో శుక్రవారం సీఐటీయూ అనుబంధ ఆర్టీసీ మహిళా విభాగం స్థాఫర్స్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా విస్తత స్థాయి సమావేశం నిర్వహించారు. మహిళలకు అన్ని రకాలుగా రక్షణ కల్పించడంతోపాట, చట్టసభల్లో మహిళా ప్రాధాన్యతను పెంచాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎస్డబ్ల్యూఎఫ్‌ మహిళా విభాగం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్‌ గా భాగ్యలక్ష్మి, కో-కన్వీనర్‌ గా శారద, సభ్యులుగా మస్తానమ్మ, వినీల, లిల్లీ, రాజేశ్వరి, శిరీష, మమత, రెడ్డి వాణి ఎన్నికయ్యారు. ఎస్డబ్ల్యూఎఫ్‌ అధ్యక్ష కార్యదర్శులు మల్లికార్జున, శివకుమార్‌, సిఐటియు నాయకులు పెనగడం గురవయ్య, గంధం మణి తదితరులు పాల్గొన్నారు.

➡️