ఎంఎస్‌ఎంఇ జిల్లా కోర్‌ కమిటీ మెంబరుగా పార్థసారధి రెడ్డి

ఎంఎస్‌ఎంఇ జిల్లా కోర్‌ కమిటీ మెంబరుగా పార్థసారధి రెడ్డి

ఎంఎస్‌ఎంఇ జిల్లా కోర్‌ కమిటీ మెంబరుగా పార్థసారధి రెడ్డి ప్రజాశక్తి -ఏర్పేడు: కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఇ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎంఎస్‌ఎంఇ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా వారు తిరుపతి జిల్లా కోర్‌ కమిటీ మెంబర్‌ గా ఏర్పేడు మండలం చిందేపల్లి గ్రామానికి చెందిన గంగలపూడి పార్ధసారధి రెడ్డి ని 3 సంవత్సరాల కాల పరిమితితో నియమిస్తూ ఢిల్లీ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఉత్పాదకత పెంచా లన్న ఉద్దేశంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ లను ప్రోత్సహించడం కోసం వాటి ఏర్పాటుకు శిక్షణ ఇవ్వడం, రుణాలు ఇవ్వడం, సబ్సిడీని కల్పించడం, మార్కె టింగ్‌ సదుపాయాలు కల్పించడం వంటి సదుపాయాలను ఎంఎస్‌ ఎం ఈ శాఖ ఆధ్వర్యంలో చేస్తోంది. దీన్ని గ్రామీణ ప్రాంతా లలోని ప్రోత్సాహకులకు చేరువ చేయడానికి ఎంఎస్‌ఎంఈ పిసిఐ ఏర్పాటుచేసి స్టేట్‌ కమిటీలు, డిస్ట్రిక్ట్‌ కమిటీలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి డిస్ట్రిక్ట్‌ కోర్‌ కమిటీ మెంబరుగా గంగలపూడి పార్థసారధి రెడ్డిని ఎంపిక చేసింది.

➡️