ఎర్రచందనం ‘పుష్ప’లదే పైచేయిటాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి రక్షణ కరువుస్మగ్లర్ల ఘాతుకాలతో అంతర్మధనందాడులు చేస్తున్నా పట్టని ప్రభుత్వంమభ్యపెడుతున్న అధికార గణం

ఎర్రచందనం 'పుష్ప'లదే పైచేయిటాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి రక్షణ కరువుస్మగ్లర్ల ఘాతుకాలతో అంతర్మధనందాడులు చేస్తున్నా పట్టని ప్రభుత్వంమభ్యపెడుతున్న అధికార గణం

ఎర్రచందనం ‘పుష్ప’లదే పైచేయిటాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి రక్షణ కరువుస్మగ్లర్ల ఘాతుకాలతో అంతర్మధనందాడులు చేస్తున్నా పట్టని ప్రభుత్వంమభ్యపెడుతున్న అధికార గణంప్రజాశక్తి-తిరుపతి(మంగళం) శేషాచలం అటవీ ప్రాంతానికే పరిమితమైన ఎర్రచందనంను రక్షించడానికి ప్రభుత్వాలు ఏళ్ళ తరబడి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా స్మగ్లర్లు అధికారుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తమ టార్గెట్‌ అయిన ఎర్రచందనంను ఎదోఒకదారిలో దోచుకెళ్లూనే ఉన్నారు. ఇప్పటికే లక్షల హెక్టార్ల ఎర్రచందనం ఎల్లలు దాటెల్లింది. దీని వెనుక వైట్‌ కాలర్‌ నేరగాళ్లు, ఇంటి దొంగలున్నారన్న విమర్శలు దశాబ్ధాలుగా వినిపిస్తున్నా ఆ దిశగా విచారణలు సాగలేదనే చెప్పాలి. ఎర్రచందనం పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన రెడ్‌ శాండర్స్‌ యాంటి స్మగ్లింగ్‌ టాస్క్‌ఫోర్స్‌ మొదట్లో వాయు వేగంతో పనిచేస్తూ ఎక్కడికక్కడ స్మగ్లర్ల ఆటలు కట్టిస్తూ ఎర్రచందనం ఎల్లలు దాటకుండా పనిచేస్తూవచ్చింది. అయితే ఇటీవలి కాలంలో స్మగ్లర్లు తామనుకున్న పనిని ఎలాగైనా సాధించుకోవాలని అడ్డొచ్చిన వారిపై రాళ్లు, కర్రలతో దాడులు మొదలు పెట్టి నేడు కార్లతో ఢకోీట్టే వరకు వచ్చారంటే స్మగ్లర్లు బరితెగించారని తెలుస్తోంది. ఈ నెల ఫిబ్రవరి 6వ తేదీన టాస్క్‌ఫోర్స్‌కు చెందిన కానిస్టేబుల్‌ గణేష్‌ను అన్నమయ్య జిల్లా కెవిపురం, సుండుపల్లి మార్గంలో వాహనాల తనిఖి చేస్తుండగా ఎర్రచందనం స్మగ్లర్లు అతి వేగంగా కారులో వచ్చి ఢకొీట్టి చంపేశారు. ఈ ఘటనలో ఇద్దరు స్మగ్లర్లును అధికారులు అదుపులోకి తీసుకోగా కారు నడిపిన వ్యక్తి తమిళనాడులో పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఈ నెల ఎర్రచందనం పరిరక్షణ విధుల్లో భాగంగా టాస్క్‌ఫోర్స్‌ ఆర్‌ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ బృందంలోని టాస్క్‌ఫోర్స్‌ ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రభాకర్‌రావును, అటవీ వాచ్‌గార్డును వెంకటగిరి-ఏర్పేడు మార్గంలోని చింతలపాలెం అటవీ తనిఖి కేంద్రం వద్ద స్మగ్లర్ల వాహనం బ్యారికెడ్లు అడ్డుపెట్టినా వేగంగా వచ్చి బ్యారికెడ్లను ఢకొీట్టి వెళ్ళిపోయారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారు జామున జరిగినా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఎక్కడా బయటికి పొక్కనివ్వకుండా రేణిగుంట సమీపంలోని అమరా హస్పిటల్‌లో చికిత్స చేయిస్తున్నారు. ఈ సంఘటనపై మీడియాకు వచ్చిన సమాచారంతో పోలీసులను వివరణ కోరగా వారు డివైడర్‌ను డీకొని జరిగినట్టుగా చెప్పుకొచ్చారు. స్మగ్లర్ల వాహనం కాదు…గుర్తు తెలియని వాహనమని వివరణ ఇచ్చారు. ఏదిఏమైనా టాస్క్‌ఫోర్స్‌పై ఎర్రచందనం ‘పుష్ప’లదే పైచేయిగా ఉంది. మరి ఉన్నతాధికారులు ఊ అంటారో, ఊహూ అంటారో మరి.

➡️