ఎర్రచందనం స్మగ్లర్ల ఘాతుకానికి…కానిస్టేబుల్‌ గణేష్‌ బలిరూ.30 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించిన సిఎం

ఎర్రచందనం స్మగ్లర్ల ఘాతుకానికి...కానిస్టేబుల్‌ గణేష్‌ బలిరూ.30 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించిన సిఎం

ఎర్రచందనం స్మగ్లర్ల ఘాతుకానికి…కానిస్టేబుల్‌ గణేష్‌ బలిరూ.30 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించిన సిఎంప్రజాశక్తి-తిరుపతి(మంగళం)ఎర్రచందనం స్మగ్లర్ల ఘాతుకానికి టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ గణేష్‌ బలయ్యారు.. ఈ ఘటన తెలుసుకున్న సిఎం జగన్మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, అతని కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. సోమవారం సాయంత్రం తిరుపతిలోని టాస్క్‌ ఫోర్స్‌ కేంద్ర కార్యాలయం నుండి విధుల నిమిత్తం టాస్క్‌ ఫోర్స్‌ ఆర్‌ఎస్‌ఐ విశ్వనాథ్‌, వినోద్‌ బందం అన్నమయ్య జిల్లా పరిధిలోని కెవి.పురం సుండుపల్లి మార్గంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఇటువైపుగా యథేచ్ఛగా ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో గుండ్రేవారిపల్లి క్రాస్‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టడానికి టాస్క్‌ ఫోర్స్‌ బందం సిద్ధమయ్యింది. తెల్లవారుజామున ఓ వాహనంలో ఎర్రచందనం దుంగలను లోడ్‌ చేసుకుని అతివేగంగా వస్తున్న స్మగ్లర్లకు టాస్క్‌ ఫోర్స్‌ బందం వాహనాలు తనిఖీలు చేపట్టడాన్ని గుర్తించారు. కారు వేగాన్ని అమాంతం పెంచి టాస్క్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్‌ గణేష్‌ మీద నుండి దూసువెళ్లారు. ఈ హఠాత్‌ పరిణామం నుండి చేరుకున్న తోటి సిబ్బంది గణేష్‌ పరిస్థితిని చూసి హాస్పిటల్‌కు తరలించారు. పారిపోతున్న స్మగ్లర్ల వాహనాన్ని ఛేదించడానికి టాస్క్‌ ఫోర్స్‌ బందం వెంటనే అప్రమత్తమయ్యింది. వెంబడిస్తున్న టాస్క్‌ ఫోర్స్‌ బందాన్ని చూసి కారులో ఉన్న ముగ్గురు స్మగ్లర్లు దిగి తప్పించుకుని పారిపోతుండగా మిగిలిన తమిళనాడుకు చెందిన ఇద్దరు స్మగ్లర్లను మాత్రం టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది పట్టుకున్నారు. కానీ పట్టుబడ్డ తమిళనాడు వాసులుగా చెప్పబడే స్మగ్లర్ల వివరాలను మాత్రం అధికారులు మీడియాకు తెలపడానికి నిరాకరించారు. కారులో ఏడు ఎర్రచందనం దొంగలు లభించాయన్నారు. గాయాల పాలైన కానిస్టేబుల్‌ గణేష్‌ ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. దీనిపై అన్నమయ్య జిల్లా ఎస్పీ కష్ణారావు, టాస్క్‌ ఫోర్స్‌ ఎస్‌పి శ్రీనివాస్‌ సంఘటన జరిగిన ప్రాంతాన్ని మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. రూ.30 లక్షలు ఎక్స్‌గ్రేషియోగణేష్‌ మతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, 30 లక్షల రూపాయలు ఎక్స్‌ గ్రేషియో ప్రకటించారని ఎస్పీలు తెలిపారు. పోలీస్‌ విభాగం నుండి గణేష్‌ కుటుంబానికి అందవలసిన లబ్ధిని అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గణేష్‌ మతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. టాస్క్‌ ఫోర్స్‌ డిఎస్పి చెంచుబాబు, ఇతర అధికారులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. కానిస్టేబుల్‌ గణేష్‌ స్వస్థలం ధర్మవరం. చిన్నతనంలోనే తండ్రి మృతిచెందాడు. తల్లి, ఇద్దరు తోబుట్టువులతో కలిసి కష్టించి కుటుంబానికి పెద్దదిక్కయ్యాడు. పోలీసు విభాగంలో ఉద్యోగం సంపాదించాడు. బదిలీపై తిరుపతి టాస్క్‌ఫోర్స్‌కు వచ్చి జీవకోన ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. గణేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు. గణేష్‌ మృతితో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.

➡️