ఎలాంటి తప్పిదాలూ లేకుండా నిర్వహించాలిఓటర్ల జాబితా జిల్లా పరిశీలకులు పోలా భాస్కర్‌

ఎలాంటి తప్పిదాలూ లేకుండా నిర్వహించాలిఓటర్ల జాబితా జిల్లా పరిశీలకులు పోలా భాస్కర్‌

ఎలాంటి తప్పిదాలూ లేకుండా నిర్వహించాలిఓటర్ల జాబితా జిల్లా పరిశీలకులు పోలా భాస్కర్‌ ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదం లేకుండా సక్రమంగా నిర్వహించాలని తిరుపతి, చిత్తూరు జిల్లాల ఓటర్ల జాబితా పరిశీలకులు పోలా భాస్కర్‌ పేర్కొన్నారు. రూరల్‌ మండలంలోని తడుకు పంచాయతీ వేణుగోపాలపురం గ్రామంలో 32, 33, బూత్‌ పరిధిలోని బిఎల్‌వోలతో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ గ్రామాల్లో చనిపోయిన ఓటర్లు ఉంటే వెంటనే తొలగించాలని మార్పులు చేర్పులు ఉంటే వాటిని కొత్త ఓట్లను నమోదు చేయించాలన్నారు. బయట గ్రామాలలో ఉంటే అలాంటి ఓటర్లను వారు ఉన్న చోటే ఉండేలా చూడాలని, రెండు మూడు ఓట్లు ఉన్నా వాటిని పరిశీలించి ఒకే చోట ఏర్పాటు చేసి మిగిలిన చోట్ల తొలగిం చాలన్నారు. కులమత భేదాలు లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగరి ఆర్‌డివో సుజన, పుత్తూరు తహశీల్దార్‌ పరమేశ్వర స్వామి, డిప్యూటీ తహశీల్దార్‌ విజయభాస్కర్‌, పుత్తూరు మున్సిపల్‌ కమిషనర్‌ కేఎల్‌ఎం రెడ్డి. ఏఎస్‌ఓ ముని కష్ణయ్య, తడుకు సర్పంచ్‌ బొబ్బిలి వెంకటేష్‌ యాదవ్‌, పంచాయతీ కార్యదర్శులు, బిఎల్‌వోలు, గ్రామస్తులు పాల్గొన్నారు

➡️