ఎస్‌పి మల్లికా గర్గ్‌ బదిలీ అక్రమం

ఎస్‌పి మల్లికా గర్గ్‌ బదిలీ అక్రమం

ఎస్‌పి మల్లికా గర్గ్‌ బదిలీ అక్రమంప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ తిరుపతి అర్బన్‌ ఎస్‌పి మల్లికా గర్గ్‌ను అక్రమంగా బదిలీ చేశారంటూ సోమవారం టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి సుగుణమ్మ ఆధ్వర్యంలో టౌన్‌క్లబ్‌ వద్ద ధర్నా నిర్వహించారు. పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి వెస్ట్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసిపి ప్రజాప్రతినిధులు దొంగోట్లతో గెలవాలని దౌర్జన్యం చేసేందుకే కుట్రపన్ని ఎస్‌పిని బదిలీ చేయించారని విమర్శించారు. మల్లికాగర్గ్‌ నిజాయతీ గల పోలీసు ఆఫీసర్‌ కావడంతో వైసిపి అక్రమాలకు అడ్డకట్ట వేస్తుందనే ముందస్తుగా ఆమెను బదిలీ చేశారని విమర్శించారు. మల్లికాగర్గ్‌ను అర్బన్‌ ఎస్‌పిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో టిడిపి నాయకులు చినబాబు, కోడూరు బాలసుబ్రమణ్యం, బుల్లెట్‌ రమణ, పులిగోరు మురళీకృష్ణారెడ్డి, మబ్బు దేవనారాయణరెడ్డి, వూక విజయకుమార్‌, టిడిపి కార్పొరేటర్‌ ఆర్‌సి మునిక్రిష్ణ, జనసేన నాయకులు రాజారెడ్డి, ముక్కుసత్యవంతుడు పాల్గొన్నారు.

➡️