ఎస్వీయూలో న్యాయ విద్యార్థుల సంబరాలు

Mar 26,2024 00:28
ఎస్వీయూలో న్యాయ విద్యార్థుల సంబరాలు

ఎస్వీయూలో న్యాయ విద్యార్థుల సంబరాలు ప్రజాశక్తి – క్యాంపస్‌ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఐదు సంవత్సరాల న్యాయవిద్యను ప్రవేశపెట్టి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం జరిగే న్యాయ కళాశాల ఉత్సవాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వైవి చంద్రచూడ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నట్లు కళాశాల ఇన్చార్జ్‌ డీన్‌ ఆచార్య వీఆర్సీ కష్ణయ్య వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో కేరింతలతో సోమవారం సాయంత్రం పరిపాలన భవనం ఎదుట చిందులేశారు. దేశ అత్యున్నత స్థాయి న్యాయవ్యవస్థ అధిపతి అయిన సుప్రీంకోర్టు జడ్జ్‌ జస్టిస్‌ వైవి చంద్ర చూడ్‌ ఈ కార్యక్రమానికి అతిథిగా రావడం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపింది ఈ సందర్భంగా వారం రోజులుగా విద్యార్థులు ఆటల పాటల పోటీలలో తోపాటు, కీస్‌ వంటి కాంపిటీషన్‌ పోటీలలో తీవ్రంగా శ్రమిస్తున్నారు ఇందులో భాగంగా పరిపాలన భవనం ఎదుట సాయంత్రం గంటన్నర సేపు విద్యార్థులు వివిధ జాతీయ ఇన్స్పిరేషనల్‌ సంఘాలకు డాన్సులు వేసి అలరించారు. దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హాజరు కావడం పట్ల ఎస్వీయూ ఉపకులపతి ఆచార్య వంగిమల శ్రీకాంత్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఎస్వీయూ విద్యార్థులు చక్కగా క్రమశిక్షణతో, నిబద్ధతతో చదువులలో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు.

➡️