కంట తడిపెట్టిన సుగుణమ్

కంట తడిపెట్టిన సుగుణమ్

కంట తడిపెట్టిన సుగుణమ్మప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ తిరుపతి మాజీ ఎంఎల్‌ఎ ఎం.సుగుణమ్మ పట్టు వదలకుండా ‘టిక్కెట్‌’ కోసం అభ్యర్ధిస్తూనే ఉన్నారు. సోమవారం మీడియా ఎదుట ఆమె నివాసంలో సుగుణమ్మ, మనవరాలు కీర్తి కన్నీటి పర్యంతమయ్యారు. మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఎంఎల్‌ఎ అభ్యర్థి ఆరణి శ్రీనివాస్‌ కాకుండా, స్థానిక అభ్యర్థికి టిక్కెట్‌ ఇస్తే తమకు ఏమాత్రం అభ్యంతరం లేదన్నారు. జనసేన ఎంఎల్‌ఎ అభ్యర్థి చిత్తూరు వైసిపి ఎంఎల్‌ఎ కావడాన్ని తిరుపతి నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోవడం లేదన్నారు. తన కుటుంబం రాజకీయాల నుంచి వచ్చిందని, వ్యాపారాలు చేసి, కాంట్రాక్టులు చేసి పైకి రాలేదన్నారు. తిరుపతి అభ్యర్థి విషయంలో ఎన్నో సర్వేలు చేశారని, ఆ సర్వేల్లో తనకే ఎక్కువ అనుకూలంగా ఓట్లు వచ్చాయన్నారు. ఏదిఏమైనా తిరుపతి నగరంలో అసెంబ్లీకి, పార్లమెంట్‌కు వైసిపి నుంచి వలస వచ్చిన వారే అభ్యర్థులు కావడం గమనార్హం. అందరినీ కలుపుకుపోతా : ఆరణి శ్రీనివాసులు తిరుపతి సిటి : తిరుపతిలో ఈనెల 27వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తానని జనసేన టిడిపి బిజెపి కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఓ ప్రైవేట్‌ హోటల్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన అ్భ్యర్థిగా తనను ప్రకటించారని, మూడు పార్టీల కలయికతో విజయం సాధిస్తానన్నారు. తిరుపతిలో అన్యాయం, అక్రమాలు, టిడిఆర్‌ బాండ్లు, గంజాయి రూపుమాపుతానన్నారు. వైసిపిలో తనకు అన్యాయం జరిగిందని, జనసేన నాయకులు అండగా నిలిచారన్నారు. కపిలతీర్థంలో దర్శనం చేసుకుని జీవకోన నుంచి ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. జనసేన జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ హరిప్రసాద్‌ మాట్లాడుతూ పార్టీ నాయకత్వం ఆరణి శ్రీనివాసులును కూటమి అభ్యర్థిగా తమ ముందు ఉంచిందని, అందరినీ సమన్వయ పరచుకుని గెలిపించుకుంటామన్నారు. ఈ సమావేశంలో బీగాల అరుణ, మధులత, కీర్తన, బాలసుబ్రమణ్యం రెడ్డి పాల్గొన్నారు. అయితే టిడిపి ముఖ్య నేతలు దూరంగా ఉండటం గమనార్హం.

➡️