కరకంబాడి గుట్ట పైన పేదలకు పట్టాలివ్వాలి

Feb 15,2024 21:42
కరకంబాడి గుట్ట పైన పేదలకు పట్టాలివ్వాలి

ప్రజాశక్తి – రేణిగుంట రేణిగుంట మండలంలో జగనన్న పట్టాదారులైన అర్హులైన పేదలకు మండల పరిధిలోనే ఇంటి స్థలం చూపాలని, అదేవిధంగా కరకంబాడి గుట్ట పైన సుమారు నాలుగువేల మంది వేసుకున్న పేదల గుడిసెలకు ఇంటి పట్టా ఇవ్వాలని ఇంటిస్థలాల సాధన పోరాట కమిటి అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్‌, సత్యశ్రీ డిమాండ్‌చేశారు. కరకంబాడి పర్యటనలో భాగంగా శ్రీ కట్ట పుట్టాలమ్మ గుడి వద్ద గురువారం మధ్యాహ్నం. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య, మండల కార్యదర్శి హరినాథ్‌, కెవిపిఎస్‌ మండల కార్యదర్శి సెల్వరాజ్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చి రేణిగుంట మండలంలో జగనన్న పట్టా లబ్ధిదారులకు జరిగిన అన్యాయం గురించి వివరించారు 153/1సర్వే నంబర్‌లో సిద్దుల రవి ఆక్రమించుకున్నారని, అక్రమ మైనింగ్‌ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమండ్‌చేశారు. పది రోజుల్లోపు జగనన్న పట్టాదారులకు స్థలాలు చూపిస్తామని ఎంఎల్‌ఎ హామీ ఇచ్చారని హరినాథ్‌ తెలిపారు.

➡️