కలెక్టరేట్లో ఉద్యోగుల నిరసన

కలెక్టరేట్లో ఉద్యోగుల నిరసన

కలెక్టరేట్లో ఉద్యోగుల నిరసనప్రజాశక్తి -తిరుపతి సిటీ రాష్ట్ర జేఏసీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఏపీ జెఎసి చైర్మన్‌, తిరుపతి అధ్యక్షులు ఎస్‌ సురేష్‌ బాబు ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్‌లో శుక్రవారం ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఎస్‌ సురేష్‌ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తుందని, ఉద్యోగులు దాచుకున్న జిపిఎఫ్‌ ,ఏపీ జి ఎల్‌ ఐ బిల్లులు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. ఐదేళ్లలో ఒకే ఒక డిఏ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఇదేనని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఇక ముందు చూడలేమని పేర్కొన్నారు, సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చి, గాలికి వదిలేసిందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై జీవో విడుదల చేసి అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని, తక్షణమే వాళ్ళని రెగ్యులర్‌ చేయాలని కోరారు. జేఏసీ సెక్రటరీ జనరల్‌ నిర్మల మాట్లాడుతూ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం సుమారు 22 వేల కోట్ల రూపాయలు బకాయి ఉందన్నారు. 12వ పిఆర్సి అమలులో ఆలస్యమైనందువలన పెరిగిన ధరలను అనుసరించి 30 శాతం మధ్యంతర భతిని ప్రకటించాలని కోరారు, ఈ కార్యక్రమంలో గిరి బాబు, శ్రీనివాసులు, హిమగిరి, పద్మజ, రవి శంకర్‌ రెడ్డి, మధుసూదన్‌ రెడ్డి, జగన్నాథం, వెంకట ముని, రమణారెడ్డి, ముని కేశవులు, మునిరత్నం, తదితరులు పాల్గొన్నారుబుచ్చినాయుడు కండ్రిగ : మండలంలోని కల్లివెట్టు ఉన్నత పాఠశాలలో ఎపిజెఎసి పిలుపు మేరకు దశలవారీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. పెండింగ్‌ డిఎలు విడుదల చేయాలని, బకాయిలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

➡️